ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి

🖨️ Print

జనం న్యూస్ నవంబర్ 2 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మండల ప్రతినిధి శివశంకర్ అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం పాత నారావారిగూడెం గ్రామంలో ఆదివారం జరిగిన పేరుబోయిన వెంకటేశ్వరరావు మనవరాలు, పేరబోయిన రమేష్ – చెల్లమ్మ దంపతుల కుమార్తెలు ఉష నాగ శ్రీజ, లావణ్యల ఓణీల అలంకరణ (హాఫ్ శారీ ఫంక్షన్) వేడుక వైభవంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి బూర్గంపహాడ్, అశ్వారావుపేట నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర తొలి ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలో పాల్గొన్న ఆయన చిన్నారులు ఉష నాగ శ్రీజ, లావణ్యలను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దీవిస్తూ నూతన వస్త్రాలను అందజేశారు. కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఇలాంటి కుటుంబ వేడుకలు బంధుమిత్రుల కలయికకు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఈ అట్టహాస వేడుకలో మాజీ జడ్పీటీసీ అంకిత మల్లికార్జున రావు , పాత నారావారిగూడెం మాజీ సర్పంచ్ పొట్ట రాజులు , ప్రముఖ నాయకులు సత్యనారాయణ , వీర వెంకయ్య , వెంకన్న బాబు , కుటుంబ పెద్దలు, గ్రామ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *