గుంతకల్లు– ఓటు హక్కును వినియోగించుకున్న వైయస్సార్సీపి గుంతకల్లు చైర్మన్ అభ్యర్థి నంగినేని వెంకటలక్ష్మి..!

🖨️ Print

(జనం న్యూస్) 2 నవంబర్ గుంతకల్లు పట్టణం రిపోర్టర్ అహ్మద్ ఖాన్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. గుంతకల్లు (న్యూస్) :: 01/11/2026 స్థానిక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదివారం వైయస్సార్సీపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నంగినేని వెంకటలక్ష్మి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలికమైనదని, గుంతకల్లు పట్టణ ప్రజలందరూ బాధ్యతగా పోలింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *