
జనం న్యూస్, నవంబర్ 2 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్): శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గౌనివారిపల్లి గ్రామంలో కూటమి నాయకులు ఆదివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గౌనివారిపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా కూటమి తరఫున పోటీ చేస్తున్న జంగం విజయలక్ష్మికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ ఎంపీటీసీ అభ్యర్థి జంగం విజయలక్ష్మి సైకిల్ గుర్తుకు, గోరంట్ల మండల జడ్పీటీసీ అభ్యర్థి దాసరి సునేత్ర గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. ఈ మేరకు కరపత్రాలను పంపిణీ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ రెడ్డి, నాగభూషణ, రవిమోహన్, జంగం తిరుపాల్, రోహిత్, నాగేంద్ర, పసుపులేటి శ్రీనివాసులు, ప్రభాకర్, తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
