
(జనం న్యూస్) 2 నవంబర్ గుంతకల్లు పట్టణం రిపోర్టర్ అహ్మద్ ఖాన్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. గుంతకల్లు (న్యూస్) :: 01/11/2026 ఈరోజు స్థానిక మున్సిపాల్ ఎన్నికల సందర్భంగా ఆదివారం పట్టణంలోని 25 వ వార్డు ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. పట్టణ ప్రజలందరూ ప్రజాస్వామ్య బద్దంగా, బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు..ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని స్పష్టం చేశారు.