
(జనం న్యూస్) 2 నవంబర్ గుంతకల్లు పట్టణం రిపోర్టర్ అహ్మద్ ఖాన్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. గుంతకల్లు (న్యూస్) :: 01/11/2026 ఈరోజు స్థానిక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదివారం పట్టణంలోని 25 వ వార్డు ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఆర్. పవన్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆర్.పవన్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, గుంతకల్లు పట్టణ ప్రజలందరూ బాధ్యతగా పోలింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని కోరారు.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని స్పష్టం చేశారు.