గోరంట్ల 1వ ఎంపీటీసీ అభ్యర్థి కురుబ సత్యనారాయణకు మద్దతుగా వైసీపీ శ్రేణులు ప్రచారం

ప్రచారంలో పాల్గొన్న గోరంట్ల మండల జడ్పీటీసీ అభ్యర్థి డి. ఆరిఫా.
🖨️ Print

జనం న్యూస్, నవంబర్ 2 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్): శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని 1వ ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కురుబ సత్యనారాయణకు మద్దతుగా ఆదివారం పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి కురుబ సత్యనారాయణతో పాటు గోరంట్ల మండల జడ్పీటీసీ అభ్యర్థి డి. ఆరిఫా పాల్గొని ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. ఎంపీటీసీ అభ్యర్థి కురుబసత్యనారాయణకు కేటాయించిన ఫ్యాన్ గుర్తును ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 5వ తేదీన జరిగే పోలింగ్‌లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
అలాగే ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని అభ్యర్థులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *