ఘట్కేసర్ రైల్వే వంతెన ఆగిన పనులు తక్షణమే మొదలు పెట్టాలి – బి ఆర్ ఎస్ ఘట్కేసర్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్

🖨️ Print

(జనం న్యూస్) 01.11.26 ఎం ఎం సి ఘట్కేసర్ ప్రతినిధి సుమన్ ఘట్కేసర్ టౌన్ లో నిర్మిస్తున్న రైల్వే వంతెన పనుల విషయంలో నిన్న అఖిలపక్ష నాయకులకు ఇచ్చిన మాట ప్రకారం ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి సంబంధిత ఆర్ / బి మరియు మున్సిపల్. హెచ్ ఆర్ డి సి అధికారులకు వెంటబెట్టుకొని రైల్వే వంతెన పనులు జరుగుతున్న ప్రదేశం వద్ద చేరుకొని అఖిలపక్ష నాయకులతో వంతెన పనుల గురించి బాధితులకు టిడిఆర్ల విషయంలో చర్చించడం జరిగింది. త్వరలో వంతెన పనుల పూర్తి చేయుటకు మరియు బాధితులకు నష్టపరిహార విషయంలో వారికి న్యాయం చేస్తామని అఖిలపక్ష నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఈ బ్రిడ్జి పనులు పూర్తి అయ్యే వరకు బాధితులకు నష్టపరిహారం వచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని సోమవారం రోజున తలపెట్టిన ఘట్కేసర్ బందును ఘట్కేసర్ పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొని తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి పోయేటట్టు చేయాలని సోమవారం రోజున ఉదయం 10 గంటల వరకు లాల్ బహదూర్ స్మారక యువజన సంఘం భవనం వద్దకు చేరుకోవాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *