
(జనం న్యూస్)02.11.26 ఎం ఎం సి ఘట్కేసర్ ప్రతినిధి సుమన్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం గాంధీనగర్‌కు చెందిన చిన్నారి స్లెస్సర్ గ్లాడిస్ కొండమూది తైక్వాండో క్రీడలో తన ప్రతిభను చాటుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో భాగస్వామిగా నిలిచి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. 2026 ఆగస్టు 9న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ప్రపంచంలోనే అతిపెద్ద తైక్వాండో పాఠం కార్యక్రమంలో మొత్తం 533 మంది పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న స్లెస్సర్ గ్లాడిస్ కొండమూది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అందుకోవడం విశేషం. ఈ ఘనతకు సంబంధించిన అవార్డు ప్రదాన కార్యక్రమం అక్టోబర్ 30న హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ అసెంబ్లీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి చేతుల మీదుగా చిన్నారి సర్టిఫికెట్ అందుకుంది. ఈ కార్యక్రమంలో తైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి, కె.పి. హనుమంతు, తైక్వాండో మాస్టర్ గ్యార నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చిన్నారికి శిక్షణనిస్తూ, ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకువచ్చిన మాస్టర్లకు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మాస్టర్ గ్యార నాగరాజు చేసిన కృషిని అభినందించారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కార్యక్రమంలో భాగస్వామిగా నిలవడం ఎంతో అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వం, చిన్నారి పట్టుదల ఈ విజయానికి కారణమని కొనియాడారు.