జనం న్యూస్ 02 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు మల్దకల్ మండల కేంద్రంలో పాల్వాయి గ్రామంలో బిజెపి సీనియర్ నాయకుడు పాల్వాయి రాముడు అధ్యక్షతన ఓటర్ల జాబిత సమగ్ర సవరణ ప్రక్రియ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు శ్రీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ద్వారా చనిపోయిన వారు ఇల్లు మారిన వారు ,డబల్ ఎంట్రీ ల పేర్లను తొలగించి 18 ఏళ్లు నిండిన అర్హులైన పతి భారతీయుడిని ఓటరు జాబితాలో చేర్పించాలన్నారు. ఈనెల ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమని అన్నారు ప్రతి అరుడైన ఓటర్ పేరు జాబితాలో ఉండేలా బిఎల్ఎలు అప్రమంతంగా పనిచేయాలని సూచించారు నిజమైన ఓటర్లు ఇబ్బంది పడకుండా ప్రజలకు అండగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ బండల వెంకట రాములు ,జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి బిజెపి సీనియర్ నాయకులు బాబుల్ రెడ్డి వాసు రెడ్డి పసుల రామకృష్ణ గోకారి గంగా దర్ రెడ్డి తదితరులు ఉన్నారు.