జనం న్యూస్,జూన్ 30మసాయిపేట్, మొహమ్మద్ ముజామిల్ చేగుంట మండలంలోని వడియారం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొని ,అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చేగుంట మండల కేంద్రంలో ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరుగుతున్న 21వ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వడియారం సర్పంచ్ సాయికుమార్ గౌడ్, ఉపసర్పంచ్ రఫీ, కాషాబోయిన భాస్కర్, అయిత పరంజ్యోతి, సండ్రుగు శ్రీకాంత్, సతీష్, రఘరాములు, పూర్రా ఆగం, రాజేష్, ఆలయ కమిటీ సభ్యులు, మండలంలోని వివిధ గ్రామాల సినియర్ నాయకులు పాల్గొన్నారు.