జనం న్యూస్, జులై 2(జిల్లా ఇంచార్జ్ ) కరీంనగర్ జిల్లా జమ్మికుంట నూతన తహసీల్దార్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గడ్డం సుధాకర్‌ను స్థానిక జర్నలిస్టులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జమ్మికుంట ప్రాంత అభివృద్ధి, రెవెన్యూ సేవలను ప్రజలకు సకాలంలో అందించడం, భూ సమస్యల పరిష్కారం, ధరణి సంబంధిత అంశాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ గడ్డం సుధాకర్ మాట్లాడుతూ, ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలందించేందుకు కట్టుబడి ఉన్నానన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికీ సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా రైతులు, పేదలు, వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పంతాటి రవీందర్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే రెవెన్యూ శాఖ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవలందించాలని అన్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే అధికారులకు మీడియా ఎల్లప్పుడూ సహకరిస్తుందని పేర్కొన్నారు.జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజ అభివృద్ధికి తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారని, అధికారులు-మీడియా పరస్పర సహకారంతో పనిచేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని సమావేశంలో అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పంతాటి రవీందర్, ఎంఏ రషీద్, దాట్ల శ్రీనివాస్, కొంగల కుమార్, జి. అఖిల్ వంశీ, తిప్పారపు రవీ, బుర్ర కుమార్ తదితర జర్నలిస్టులు పాల్గొని నూతన తహసీల్దార్ గడ్డం సుధాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.