జనం న్యూస్, జులై 1, అల్లూరి జిల్లా ప్రతినిధి గోపిరెడ్డి : అనంతగిరి మండలంలో రోడ్ల అభివృద్ధికి మహర్దశ పట్టిందని అనంతగిరి ఎంపీపీ తడబారికీ మితుల హర్షం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని 10 పంచాయతీలకు సంబంధించి మొత్తం 14 రోడ్ల నిర్మాణ పనులు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) పథకం ద్వారా మంజూరైనట్లు ఆమె అధికారికంగా వెల్లడించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అనంతగిరి మండల కేంద్రంలో బలమైన సంకల్పంతో ముందుకెళ్లి ప్రతి గ్రామానికి రహదారి సదుపాయం కల్పించి, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేర్చడమే తమ ధ్యేయమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంజూరైన 14 రోడ్ల వివరాలు ఇలా ఉన్నాయి: గాలిపాడు రోడ్డు నుండి మెట్టవలస భీంపోలు రోడ్డు నుండి సీతంపేట, మర్రివలస నుండి పసిమీ, గుమ్మకోట రోడ్డు నుండి డంసరాయి, ఎన్ ఆర్ పురం రోడ్డు నుండి వై. బూడి, గుమ్మ రోడ్డు నుండి ధనుకోట, మెట్ట వలస నుండి ఒసుకొండ, డి కోటపర్తి రోడ్డు నుండి డెయిజన్ వలస, జాకరవలస జాం,, నుండి బోరిబోరి వలస వాకపల్లి రోడ్డు నుండి బెంబి రేగులపాలెం నుండి టమాటు వెలమామిడి రోడ్డు నుండి బోడ్లపుట్ డొంకయి పుట్ రోడ్డు నుండి గోమంగిపాడు. సరసపాడు రోడ్డు నుండి టంకోట ఈ రోడ్ల నిర్మాణంతో అనంతగిరి మండలంలోని మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగై, ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. గ్రామీణ భారత నిర్మాణానికి దృఢ సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంపీపీ తడబారికీ మితుల తెలిపారు.