పొరపాట్లకు తావివ్వద్దు: తహసిల్దార్ రాజశేఖర్ రెడ్డి

జనం న్యూస్ జూలై 1 మండలం పెన్ పహాడ్ : మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ప్రతినిధుల (బీఎల్‌ఏ) సమక్షంలో సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ఫామ్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తాసిల్దార్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఓటరు జాబితా రూపకల్పనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని అధికారులను, రాజకీయ ప్రతినిధులను ఆదేశించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్ ఫామ్‌ను ఎలా భర్తీ చేయాలి, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ,తొలగింపులపై క్షుణ్ణంగా వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుని రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఈ ప్రక్రియ పూర్తిస్థాయి పారదర్శకతతో జరగాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు (బీఎల్‌ఏలు), బీఎల్‌ఓ సీనియర్ అసిస్టెంట్ రాధ, ఆర్ ఐ అజీజ ఉన్నిసా , ఏఎస్ఓ నవీన్, ఎన్.శ్రీనువాసు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *