జనం న్యూస్ /మార్కాపురం జిల్లా.. పుల్లల చెరువు మండలం 25/06/2026 పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గద్దె వెంకటేశ్వర్లు (దిమ్ము)ఏర్పాటు చేసిన మణికంఠ మొక్కల నర్సరీని ఘనంగా ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రతి ఇంటి ఆవరణలో పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ నర్సరీ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పుల్లలచెరువు మండల టీడీపీ అధ్యక్షులు పోట్ల గోవిందు, సీనియర్ నాయకులు శనగ నారాయణరెడ్డి కాకర్ల కోటయ్య రెంటపల్లి సుబ్బరెడ్డి , మాజీ మండల పార్టీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ మేడికొండ లక్ష్మణ్ పల్లపాటి బాధరయ్యా మేడికొండ అనిల్, వేగినాటి శ్రీను పాతకోటి రామిరెడ్డి కేశనపల్లి బక్కయ్య మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి మణికంఠ మొక్కల నర్సరీ ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి గ్రామంలో ఇలాంటి నర్సరీలు ఏర్పాటు కావడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, పచ్చదనం పెంపొందించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.