జనం న్యూస్ జూన్ 27 రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు మండలంలో గల గుడ్డిప గ్రామానికి చెందిన మాచేపల్లి సంతోష్ కుమార్ కు మద్రాస్ ఓషన్ స్ట్రక్చర్ కాలేజీలో మెరైన్ ఇంజనీరింగ్ కు చేయడానికి సీటు లభించింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన గేట్ పరీక్షలో ఆల్ ఇండియాలో సంతోష్ కు 6 వ ర్యాంకు వచ్చింది. దీని ఆధారంగా ఓషన్ స్ట్రక్చర్ లో సీటు ఖరారు చేస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ మద్రాస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాలేజీలో జాయిన్ అయ్యేందుకు వెళుతున్న సంతోష్ కుమార్ కు గ్రామస్తులు ఘనంగా అభినందనలు తెలిపారు.