జనం న్యూస్ జూలై 2 కోటబొమ్మాళి మండలం :గడిచిన ఐదేళ్ల పాలనలో మూడు రాజదానులని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళి ఇప్పుడు మావిగన్ రాజధాని అని ప్రకటించటం చూస్తే ఆయనకు ఏ విషయ లోను స్పష్టతలేదని, అలాంటి వ్యక్తి ప్రజలకు ఏం మీలు చేస్తారని రాష్ట్ర కళింగ కోమటి కార్పోరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు ప్రశ్నించారు. ఆయన గురువారం స్థానిక విలేకర్లుతో మాట్లాడతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది కనుకనే జగన్ అది చూసి ఓర్వలేకనే ఇప్పుడు మావిగన్ గళమెత్తుకున్నారని ఎద్దేవా చేశారు. అప్పుడు విశాఖపట్నం రాజదాని అన్నారు కాదా…? ఇక వదిలేసినట్లేనా అని ప్రతిక సోదరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోవడం ఆయన వైఖరికి ఒక మచ్చు తనకు అన్నారు. నేడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై నమ్మకంతో వస్తున్న పెట్టుబడులకు నిన్న జరిగిన సత్యవేడు హీరో పరిశ్రమ తార్కణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్లుగానే సంపద సృష్టిస్తున్నారని, అది వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదని, దీంతో మతిభ్రమించి ఏవేవో మాట్లాడుతున్నారని గోవిందరాజులు విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు కూటమి చేతుల్లోనే ఉందని, మీకు చేతనైతే సహకరించండి, లేదంటే ఇంట్లో కూర్చోండి, అంతే కానీ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నాలు చేయవద్దని అని ఆయన హితో పలికారు. చైతన్యవంతులైన ప్రజలు విజ్ఞతతో ఆలోచించే కూటమి ప్రభుత్వానికి అధికారి ఇచ్చారని, అది గుర్తించి నడుచుకోకపోతే నిన్న అమరావతిలో జరిగిన గతి పట్టక తప్పదని గోవిందరాజులు జోష్యం చెప్పారు.