జనం న్యూస్/ గంభీరావుపేట 02 జూలై, గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గా నిమ్మల తిరుపతి గౌడ్ గారిని,జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అధికారికంగా నిమ్మల తిరుపతి గౌడ్ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా గంభీరావుపేట అమరవీరుల స్తూపం వద్ద పార్టీ కార్యకర్తలు నూతనంగా మండల అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన నిమ్మల తిరుపతి గౌడ్ పూలమాలవేసి శాలువాతో సత్కరించి,టపాకాయలు పేల్చి స్వీట్లు పంచు కొన్నారు.
ఈ సందర్భంగా తిరుపతి గౌడ్ మాట్లాడుతూ అధ్యక్ష పదవికి సహకరించిన పార్టీ పెద్దలకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాపై పెట్టిన బాధ్యతను స్వీకరిస్తూ, తూచా తప్పకుండా క్రమశిక్షణతో కలిగి ఉంటానని, ఏ ఒక్కరి మనోభావాలకు భంగం కలిగించకుండా పార్టీ అభ్యున్నతి కోసం ప్రజల శ్రేయస్సు కోసం పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం పనిచేస్తానని నిమ్మల తిరుపతి గౌడ్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని నిజమైన అర్హులకు అందే విధంగా కృషి చేస్తానని భరోసా కల్పించారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలుగా అటు ప్రజల కోసం ఇటు పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు రావడం కోసం ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలకు అందుబాటులో ఉండి వారి సహకారంతో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని వారికి తగిన గుర్తింపు రావడం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గౌరీ శంకర్, పార్టీ సీనియర్ నాయకులు యెల్లే బాల కిషన్, దమ్మ శ్రీనివాస్ రెడ్డి, ఎండి అక్బర్, గోపగారి లక్ష్మి నారాయణ గౌడ్, మహారాష్ట్ర దేవయ్య, అక్క పెళ్లి బాలయ్య, పెద్దవేణి మల్లయ్య, శనిగరపు నరేష్, బంగ్లా రాజు గౌడ్, యువ నాయకులు దేశెట్టి రాజశేఖర్, ఏడబోయిన మహేష్, లక్కం బాబు, టేకుమల్ల ప్రవీణ్, మరియు తదితరులు పాల్గొన్నారు.