జనం న్యూస్ టేకులపల్లి జూన్ 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు గ్రామంలో బుధవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో మరణించిన పోదేం చుక్కమ్మ కుటుంబాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పరామర్శించారు.
ఈ సందర్భంగా బోడు సర్పంచ్ స్వరూప వరి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రమాద ఘటనపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలను అధికారులు వెంటనే సేకరించకపోవడంపై విద్యుత్ శాఖ అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అదే గ్రామంలో గురువారం చెట్టుకు ఉరి వేసుకొని మరణించిన మాడే పాపయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి మరణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ రెండు క బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఖాదర్ బాబు ,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, పోశాలు, సర్పంచులు శుభాష్ చంద్ర బోస్, సురేష్, హనుమంతు, నాయకులు సర్దార్,సంజయ్,రవి, శేఖర్, తదితరులు పాల్గొన్న