డెయిరీ నగర్ లో అర్హులందరికీ పట్టాలు ఇవ్వండిగ్రీవెన్స్ లో గిడ్డి ఈశ్వరిని అభ్యర్థించిన ఆ గ్రామస్తులు

జనం న్యూస్ జూన్ 26( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) అల్లూరి జిల్లాచింతపల్లి మండలం డెయిరీ నగర్ గ్రామస్తులు ఎంతోకాలంగా భూములు సాగు చేసుకుంటున్నా సరే ఇప్పటి వరకు తమకు పట్టాలు అందించలేదని అర్హులైన వారందరికీ పట్టాలు అందించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు శ్రీమతి గడ్డి ఈశ్వరి గారిని అభ్యర్థించారు. పాడేరులోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. డెయిరీ నగర్ గ్రామస్తులు గ్రీవెన్స్ లో తమ సమస్యను విన్నవించారు. 50 సంవత్సరాలకు పైబడి ఆ గ్రామంలో నివాసం ఉంటూ భూములు సాగు చేసుకుంటున్న సరే తమకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని తమకు అది తప్ప మరొక ఆధారం లేదని తమను ఆదుకోవాలని వారంతా ఈశ్వరి గారిని అభ్యర్థించారు. పట్టాలు ఇవ్వాలని అనేకసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్న సరే వంకలు పెట్టి తమకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వారంతా పేర్కొన్నారు. ఈ విషయంపై ఈశ్వరి గారు చింతపల్లి తహసిల్దార్ తో ఫోన్లో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని ఆమె ఆదేశించారు. ఈ సమస్యపై వెంటనే జాయింట్ కలెక్టర్ కు నివేదిక అందించి అర్హులు జాబుతాను సిద్ధం చేయాలన్నారు. అవసరం అనుకుంటే ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు తాను వస్తానని ఈ సమస్య పరిష్కారం కోసం స్థానికులు అనేక ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై జేసీ గారికి సవివరంగా తెలియజేసి త్వరితగతిన పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. దీనికి తహసిల్దార్ గారు స్పందిస్తూ ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని అన్ని విషయాలు జెసి గారి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. త్వరలోనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ గ్రీవెన్స్ లో నూతన పెన్షన్లు మంజూరు చేయాలని పలువురు అభ్యర్థించారు. గ్రామాలలో ఇప్పటికీ తాగునీటి సమస్య ఎద్దడి ఉందని, డ్రైనేజీ నిర్మాణం చేయక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని, చెత్త ఎక్కడికి అక్కడ పేరుకు పోతుందని ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని పలువురు గ్రీవెన్స్ ను ఆశ్రయించారు. గ్రామాల్లో భూముల రీసర్వే జరుగుతున్న నేపథ్యంలో రైతులు లేకుండానే సర్వేలు చేస్తున్న అంశాలపై కూడా ఈ గ్రీవెన్స్ సృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలపర్తి గోవిందరావు మాస్టర్ , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి బొర్ర విజయ రాణి గారు, పిఎసిఎస్ చైర్మన్ డప్పోడి వెంకటరమణ, చింతపల్లి మండల పార్టీ అధ్యక్షులు పూర్ణచంద్రరావు గారు, డెయిరీ నగర్ టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *