జనం న్యూస్ గోరంట్ల, జూన్ 26 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్): ఆర్యవైశ్య మహాసభ శ్రీ సత్యసాయి జిల్లా యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా గోరంట్లకు చెందిన విశ్వహిందూ పరిషత్ ధర్మచార్య సంపర్క్ శ్రీసత్యసాయిజిల్లా ప్రముఖ్ బైసాని శ్రీనివాస్ గుప్తా కుమారుడు యువనేత బైసాని రఘు రామ్ గుప్తాను నియమించారు. ఆర్యవైశ్య లెజెండ్, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ప్రేరణతో, రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్య ఆశీస్సులతో, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు కండె రాజేష్ మార్గదర్శకత్వంలో, జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ సహకారంతో ఈ నియామకం జరిగినట్లు సంఘ నాయకులు తెలిపారు. సమాజ సేవ పట్ల బైసాని రఘు రామ్ గుప్తాకు ఉన్న నిబద్ధత, యువతతో ఆయనకు ఉన్న అనుబంధం, సేవా దృక్పథం దృష్ట్యా సంఘ కార్యకలాపాలకు మరింత బలాన్ని చేకూర్చగలరనే విశ్వాసాన్ని నాయకులు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బైసాని రఘు రామ్ గుప్తాకు ఆర్యవైశ్య మహాసభ నాయకులు, యువజన సంఘ సభ్యులు, అభిమానులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. యువజన సంఘ అభివృద్ధికి విశేష సేవలు అందించి సమాజానికి మరింత చేరువ కావాలని కాళంగి శబరీష్
జిల్లా యువజన సంఘం అధ్యక్షులు ఆకాంక్షించారు