సోలార్ లైట్ క్రింద పడి 4 రోజులైనా పట్టించుకోని అధికారులు – గ్రామ పెద్దలు

జనం న్యూస్ (జూన్ 26): లక్కవరపుకోట మండలం రేగ గ్రామం పంచాయతీలో పేదిరెడ్లపాలెం వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనే సోలార్ స్తంభం పడి నాలుగు రోజులైనా సచివాలయం అధికారులు కానీ గ్రామ పెద్దలు కానీ పట్టించుకోలేదు అయితే స్థానిక ప్రజలు మాత్రం రాత్రి పూట లైట్ లేకపోవడం వలన వచ్చి వెళ్ళేవాళ్లకు ఇబ్బందిగా ఉంది అని అలాగే రోడ్డు తిరుగుడులో చీకటి ఉండడం వలన వాహన దారులు వేగంగా రావడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు వెంటనే అధికారులు స్పందించి స్తంబాన్ని ఎదావిదిగా వెయ్యాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *