జనం న్యూస్, గుండాల జులై. 3.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామానికి చెందిన వికలాంగుడు సింగారం.రమేష్ అమ్మనాన్న చిన్నప్పుడే 25 సంవత్సరాల క్రితమేచనిపోయారు . అప్పటినుండి రమేష్ నానమ్మతోనే కలిసి ఉండేవాడినిఅన్నాడు ఆమె కూడాగత 8 సంవత్సరాల క్రితమే చనిపోవడం జరిగింది ,కావున నేను ఒక్కడినే ఒంటరిగా ఉంటున్నాను . నేను వికలాంగుడను .నాకు ఇల్లు స్థలం ఉన్నది, కావున నాయందు దయ తలచి వికాలాంగుల కోట కింద అయినా నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని గౌరవ మండల ప్రజాపరిషత్ అధికారి గారికివినతిపత్రం ఇవ్వటం జరిగింది