అనంతగిరి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం శ్యాంసుందర్ పదవీ విరమణ.

జనం న్యూస్, జులై 01, అల్లూరిజిల్లా ప్రతినిధి గోపి రెడ్డి : అనంతగిరి స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) సొంటెని శ్యాంసుందర్ మంగళవారం పదవీ విరమణ చేశారు. విద్యాశాఖలో ఆయన అందించిన సుదీర్ఘ సేవలను కొనియాడుతూ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. శ్యాంసుందర్ మాస్టర్ క్రమశిక్షణతో పని చేస్తూ విద్యార్థుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని సహచర ఉపాధ్యాయులు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్ దంపతులను శాలువా, పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఆయన శేష జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యంగా సాగాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *