అర్హులైన ప్రతి ఓటరును గుర్తించి జాబితాలో చేర్చాలి

*మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్.

జనం న్యూస్ 25జూన్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు , మున్సిపల్ సిబ్బంది బిఎల్ ఏలతో కలిసి దస్నాపూర్, హడుక్కో కాలనీలలో ఓటరు జాబితాలను ప్రారంభించి,ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. ఈ సంధర్బంగా మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలను పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా చూడాలని బీఎల్ఏలకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడికి ఆ హక్కు అందేలా రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బిన్ అహ్మద్, బాలకృష్ణ, వార్డు ఆఫీసర్ మానుష , బీఆర్ఎస్ నాయకులు అశోక్, సాయి , బీఎల్ఏ లు లక్ష్మీ, భాగ్యలక్ష్మి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *