జనం న్యూస్ గోరంట్ల, జూన్ 26: గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లెలో వెలసిన శ్రీ మారెమ్మ దేవి ఆలయం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న “అమ్మ అనాధాశ్రమం”కు రూ.25 వేల విరాళం అందించారు. గ్రామానికి చెందిన మంగమ్మ తన కుమార్తె జయమ్మ జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందజేశారు. మంగమ్మ కుమారుడు శంకర్, శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి. దేవిరాజు స్వామి చేతుల మీదుగా విరాళం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బి. దేవిరాజు స్వామి మాట్లాడుతూ, అనాధాశ్రమ నిర్మాణానికి గ్రామస్తులు, దాతలు ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని తెలిపారు.శుక్రవారం సందర్భంగా శ్రీ మారెమ్మ దేవాలయంలో గోపూజతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విరాళం అందించిన దాతలను శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ తరఫున డాక్టర్ బి. దేవిరాజు స్వామి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పుటక శంకర్, సూరి రామ్మోహన్ రెడ్డి, దాతలు, భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.