బీఎల్‌వోలు ఏకపక్షంగా వ్యవహరిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం: వైయస్సార్సీపి అధికార ప్రతినిధి వీరన్న

జనం న్యూస్ జూన్ 26(రిపోర్టర్ రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలో గురువారం ఉరవకొండ నియోజకవర్గం ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి,విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ప్రణయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా ఉన్న బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏలు) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు మండల బూత్ బిఎల్ఎల కన్వీనర్ హబీబ్ అధ్యక్షతన ప్రత్యేక సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు జిల్లా అధికార ప్రతినిధి సిపి వీరన్న ముఖ్య అతిథిగా హాజరై బీఎల్‌ఏలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.అలాగే ఓటరు జాబితాలో ఉన్న తప్పులను గుర్తించి సకాలంలో సవరించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.బీఎల్‌వోలు తమ విధులను నిబంధనల ప్రకారం, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.ఏదైనా ప్రాంతంలో బీఎల్‌వోలు ఏకపక్ష ధోరణితో వ్యవహరించినా,అర్హుల పేర్లను తొలగించినా లేదా ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా వాటిని సహించబోమని స్పష్టం చేశారు.అలాంటి ఘటనలు తమ దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకునేలా చేస్తామని హెచ్చరించారు.ఎస్‌ఐఆర్ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా,ఖచ్చితంగా రూపొందించడమే లక్ష్యమని తెలిపారు.ప్రతి బీఎల్‌ఏ తన పరిధిలోని ఓటర్ల వివరాలను పరిశీలించి అర్హులైన వారి పేర్లు నమోదు అయ్యేలా,అనర్హుల వివరాలు తొలగించేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ సమావేశంలో మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి,ఉరవకొండ నియోజకవర్గం బిసి సెల్ అధ్యక్షులు డిష్ సురేష్,వజ్రకరూర్ వైయస్సార్సీపి టౌన్ ప్రెసిడెంట్ రవికాంత్ రెడ్డి,వైయస్సార్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఉస్మాన్,సీనియర్ నాయకులు రాకెట్ల బాబు,రఘుపతి, ఆదినారాయణ,ఎద్దటి రమేష్,ప్యాపిలి వీరాంజి,రాములు నాయక్,విజయ్,చంద్ర,మధుసూదన్ రెడ్డి,తిమ్మారెడ్డి,కొనకొండ్ల గోవిందు,ఆవుల సందీప్,మండలంలోని బీఎల్‌ఏలు,పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *