జనం న్యూస్ నందవరం:-బుధవారం 1-7-2026 ముగతి రైతు సేవ కేంద్రంలోమండల వ్యవసాయ అధికారి మరియు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ ఇచ్చారు. రైతులు ప్రకృతి సేద్యంతోనే లాభదాయకమైన పంటలు పండించవచ్చు అని డిఆర్సి ఏవో సరిత అన్నారు. మంగళవారం ముగతి రైతు సేవ కేంద్రంలో రైతులకు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులైన నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అజ్ఞాస్త్రం, జీవామృతం వంటి కషాయాలు సొంతంగా తయారు చేసుకునే విధానం రైతులకు వివరించారు. అలాగే పంట మార్పిడి, కంచ పంట, అంతర్ పంట ,ఎరువుల యాజమాన్య పద్ధతులు,50 నుంచి 60,ఎమ్ ఎమ్ వర్షపాతం పడిన తర్వాత మాత్రమే రైతులు విత్తనాలను విత్తుకోవాలని ఎల్ ని నో ప్రభావం ఉండడం వలన స్వల్పకాలిక, బెట్టాను తట్టుకొనే రకాలను విత్తుకోవాలని , భూసార పరీక్ష ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో , వ్యవసాయ అధికారి సరిత,విఎఎ ప్రశాంతి, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.