జనం న్యూస్ జూన్ 30 భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ప్రతినిధి భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో భాగంగా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం, మెట్ పల్లి, చండ్రుపల్లి గ్రామాలలోని పోలింగ్ బూత్‌లలో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహాదేవపూర్ మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాను పరిశీలించి, అధికారులకు పలు విలువైన సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, తప్పులు లేని జాబితా రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో మహాదేవపూర్ మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు, మాజి మహిళా విభాగం మంథని నియోజకవర్గం ఇంచార్జి కేదారి గీత, మాజీ మండల యూత్ అధ్యక్షుడు యండి అలీం ఖాన్, నాయకులు సుంకే మధు, కళ్యాణ్ రావు, 2వార్డ్ మెంబెర్ నిట్టూరి మహేష్, బర్ల కుమార్, బడికెలా మహేందర్, రాదారపు శ్యామ్, మోతె సాయి, రాకేష్, నిట్టూరి దేవేందర్, కోరుకొప్పుల సాయి, అడప సంతోష్,కావేరి శేఖర్, గోమాస సంతోష్, గోమాస రమేష్, జాడి చిన్న సమ్మయ్య, గోమాస లింగయ్య, తదితరులు పాల్గొనడం జరిగింది