పార్టీ బలోపేతంలో బీఎల్‌ఏల పాత్ర కీలకం.

*ఓటరు జాబితాపై బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి. *ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలి. *బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏలకు ఐడీ కార్డులు అందజేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి.

జనం న్యూస్ 2026 జూన్ 30 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో బీఎల్‌ఏల పాత్ర ఎంతో కీలకమని,ఓటరు జాబితాపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు అయ్యేలాబాధ్యతాయుతంగా పనిచేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మ దేవేందర్ రెడ్డి బిఎల్ఏలకు సూచించారు. సోమవారం మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మెదక్ పట్టణానికి చెందిన బీఎల్‌ఏలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితా అత్యంత కీలకమైందని, దానిని ఎప్పటికప్పుడు పరిశీలించి లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపై ఉందన్నారు. ఎన్నికల సంఘం చేపట్టే ప్రతి కార్యక్రమంపై పూర్తి అవగాహనతో పనిచేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా,అనర్హుల పేర్లు తొలగించేలా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పార్టీ దృష్టికి తీసుకెళ్లాలని, పార్టీ కార్యక్రమాలను ఇంటింటికీ చేరవేయడంలో సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయంతో పనిచేస్తే సంస్థాగతంగా పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు.రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి బూత్‌పై ప్రత్యేకదృష్టిసారించాలని,ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని సూచించారు. ప్రతి బీఎల్‌ఏ తనకు కేటాయించిన బూత్‌లో నిరంతరం ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెదక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అకిరెడ్డి.కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కౌన్సిలర్లు జుబెర్ అహ్మద్, బట్టి ఉదయ్, మ్యాదరి. దీపక్కుమార్,మాజీ కౌన్సిలర్ లు మాయ. మల్లేశం,బీమరి కిషోర్, పార్టీ బిఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *