జనం న్యూస్ జులై 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామంలోని రాక్ కన్వెన్షన్ సెంటర్‌లో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు సహచర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి బండి సంజయ్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ (మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు) తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, రాబోయే కార్యాచరణ, ప్రజా సమస్యలపై పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు తదితర అంశాలపై ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చలు జరిగాయి.