జనం న్యూస్ 30 జూన్ 2026 బండి ఆత్మకూరు మండలం,శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా :గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మండలంలోని సింగవరం, కడమలకాల్వ, వెంగళరెడ్డిపేట గ్రామాల్లో పర్యటించి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామాలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు
ఈ సందర్భంగా సింగవరం గ్రామంలో రూ.20 లక్షలు, కడమలకాల్వ గ్రామంలో రూ.20 లక్షలు, వెంగళరెడ్డిపేట గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రజలకు అంకితం చేశారు. అనంతరం గ్రామాల్లో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని, దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రతి మౌలిక సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ సంకల్పమని తెలిపారు.
వెంగళరెడ్డిపేటలో సీసీ రోడ్ల ప్రారంభం అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ప్రజల ఆశీర్వాదాలతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ గాయత్రి, తహసీల్దార్ పద్మావతి, ఏపీవో వసుధ, పంచాయతీ ఏఈ వెంకటరాముడు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, తెలుగు గంగా కాలువ ఉపాధ్యక్షులు కంచర్ల మనోహర్, టీడీపీ నాయకులు వెంకటాపురం శ్రీనివాసులు,ఈశ్వర్ రెడ్డి,రామసుబ్బయ్య, నబిరసూల్, ధనంజయ గౌడ్, శంకర్ గౌడ్, మణికంఠ నాయుడు, పాపయ్య, భూపాల్, పుష్ప రాజ్, రామానాయుడు, పాటు ఎన్డీయే కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…