ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

జనం న్యూస్ 2026 జూన్ 29 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్ ) ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. ఒక్క చిన్నారి కూడా మిగలకుండా అందరికీ పోలియో చుక్కలు అందేలా అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గణేశ్వర్, డీసీహెచ్ డాక్టర్ శివదయాల్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జయశ్రీ, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *