ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటండి.

జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ జూన్ 29 తేదీ 2026 పీ.ఏ.పల్లి మండల నల్గొండ జిల్లా న్యూస్. పిఎసిఎస్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం -సర్పంచ్ వంగాల శ్రీనివాస్ రెడ్డి,పిఎసిఎస్ సీఈఓ ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు పీఏ పల్లి పిఎసిఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ వంగాల శ్రీనివాస్ రెడ్డి హాజరై మొక్కలు నాటారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు తనవంతు బాధ్యతగా మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ చర్యలను కూడా తీసుకోవాలని ఆయన కోరారు,ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సీఈవో ప్రభాకర్. డైరెక్టర్ సిరసువాడ శీను, వార్డ్ మెంబర్ గున్నె బోయిన శీలత నాగేష్, సిబ్బంది మహేష్. పంకేష్, కొండల్ ఉదయ్, శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *