జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ జూన్ 29 తేదీ 2026 పీ.ఏ.పల్లి మండలం నల్గొండ జిల్లా న్యూస్. గుడిపల్లి మండలం లోని కోదండాపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం సమభావన సంఘం భవనములకి గ్రామ సర్పంచ్ మైనం రాధిక శ్రీనివాస్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. రెండు భవనములకు ముగ్గు పోసి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో స్వంత భవనాలలో ఆఫీసులు నడవాలని ఈ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. మండలం లో అన్ని గ్రామాలలో స్వంత భవనాలు లేని ఆఫీసు లకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వం స్వంత భవనాలు నిర్మించి తలిచి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మైనం రాధిక శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోగు ఈదయ్య, సెక్రెటరీ రజనీ,ఇంజనీర్, వార్డు మెంబర్లు, ఏడుకొండలు యాదవ్, అంగన్వాడీ టీచర్ పరిపూర్ణ, మల్లయ్య, బిక్షం, శంకర్, కొండలు, విజయ్, శ్రవణ్, లక్ష్మయ్య, మహేష్, రాములు, రేణుక, తదితరులు పాల్గొన్నారు.