జనంన్యూస్ జూన్ 27 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శనివారంమంగళగిరిలోని సి కన్వెన్షన్ హాల్‌లో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ పరిశీలకులు, సభ్యులతో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి, హిందూపురం పార్లమెంట్ సమాచార అబ్జర్వర్ కమిటీ సభ్యుడు చిలమత్తూరి వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన చూపుతున్న సేవలను గుర్తించి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా చిలమత్తూరి వెంకటేష్ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ, వచ్చే రెండు రోజుల్లో హిందూపురం పార్లమెంట్ పరిధిలో నిర్వహించే సమాచార సేకరణ కార్యక్రమంలో తన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత అంకితభావంతో పనిచేస్తానని చిలమత్తూరి వెంకటేష్ వెల్లడించారు.