జనం న్యూస్ మధిర జూన్ 27, దోర్నాల కృష్ణ మధిర మున్సిపాలిటీ పరిధిలో 1వ డివిజన్ కౌన్సిలర్ దోర్నాల శిరీష అధ్యక్షతన 1వ డివిజన్ లో ఈనెల 30వ తారీఖున చింతకాని మండలం మత్కేపల్లి గ్రామంలో జరగనున్న రైతు ఆశీర్వాద భారీ బహిరంగ సభకు జయప్రదం చేయటానికి సన్నాహక సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత వారు నిర్వహించినారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు పాల్గొంటున్న ఈ భారీ బహిరంగ సభకు 1వ డివిజన్ నుంచి అధిక సంఖ్యలో రైతులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు, మహిళా సంఘాల సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరినారు. ఈ సమావేశంలో ఒకటో వార్డ్ డివిజన్ అధ్యక్షులు దోర్నాల నాగ మురళి, కాంగ్రెస్ నాయకులు సామినేని రామనాథం, దోర్నాల వెంకట రవి, దోర్నాల మణిబాబు, దోర్నాల శ్రీను, కోట శ్రీను, కొత్తపల్లి రాంబాబు, సాయి, గ్రామ పెద్దలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.