కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది

జనం న్యూస్/ గంభీరావుపేట 29 జూన్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన పలు కుటుంబాలను పరామర్శించారు.
ఈ మధ్యకాలంలో విద్యుత్ షాక్ తో గురైన జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్యాల రాజ్వీర్ పరిస్థితిని తెలుసుకొని తదానంతరం ఎఎంసి డైరెక్టర్ కోటలింగం కుమారుడైన కోట అనిల్ మరియు బంగ్లా రమేష్ కుమారుడైన అన్వేష్ కారు అదుపుతప్పిన ప్రమాదంలో ఇరువురు దుర్మరణం చెందారు. వారి కుటుంబాలను సంగీతం శ్రీనివాస్ పరామర్శిస్తూ వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధీమా వ్యక్తపరిచారు.వారికి మనోధైర్యం కల్పిస్తూ మరణించిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల తిరుపతి గౌడ్, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గౌరీ శంకర్ మరియు సీనియర్ నాయకులు ఎల్లా బాలకృష్ణ, లక్ష్మీనారాయణ గౌడ్, అక్బర్, యాదుల్లా, దమ్మ శ్రీనివాస్ రెడ్డి, అక్కపెళ్లి బాలయ్య, బంగ్లా రాజు గౌడ్, యువ నాయకులు దేశెట్టి రాజశేఖర్ టేకుమల్ల ప్రవీణ్, తాజ్, మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *