జనం న్యూస్ 29జూన్ 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆత్మకూరు పట్టణంలో బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.. వెంగళరెడ్డి పేట గ్రామానికి చెందిన బాధితులకు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెంకటాపురం శ్రీనివాసులు 61000/ భూమా దస్తగిరి రెడ్డికి రెండు లక్షల 2,27,000/ రేవనూరు హుస్సేన్ కి 40,000 గ్రామానికి రూపాయల సీఎం సహాయక నిధి చెక్కుల ను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నారని, అనారోగ్యంతో బాధపడేవారు ఆసుపత్రిలోకి వెళ్లి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిది అందిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని,పేదలకు సహాయం అందిస్తూ ప్రజలను ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు. గ్రామానికి చెందిన బాధితులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.