దెందుకూరు గ్రామ పంచాయతీనీ సందర్శించిన అడిషనల్ కలెక్టర్ డా: శ్రీజ

జనం న్యూస్ మధిర జూన్ 27, దోర్నాల కృష్ణ రైతు ఆశీర్వాద బహిరంగ సభ సన్నాహక కార్యక్రమం మరియు ఈ నెల 30 వ తేదీన చింతకాని మండలంలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి సభ ఏర్పాట్ల పరిశీలన కొరకు అడిషనల్ కలెక్టర్ శ్రీజ మేడం దెందుకూరు గ్రామ పంచాయతీ ను సందర్శించడం జరిగింది. మరియు అధిక సంఖ్యలో రైతన్నలు రైతు సన్నాహక సభకు చేరుకునే విధంగా తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్య క్రమంలో మండల అభివృద్ధి అధికారియం వెంకటేశ్వర్లు , యం పీ వో గంధం శ్రీలక్ష్మి గ్రామ సర్పంచ్ పగిడిపల్లి శ్రీనివాసరావు , సొసైటీ చైర్మన్ కోట వెంకట కృష్ణ , ఏ ఓ సాయి దీక్షిత్ , ఏ ఈ ఓ ప్రవళిక ,స్వయం సహాయక గ్రూప్ సభ్యులు, గ్రామస్థులు,పంచాయతీ కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *