డిగ్రీ విద్యార్థులకు ఏఐ మెంటార్ షిప్

జనం న్యూస్ జూన్ 30 గంభీరావుపేట మండల రిపోర్టర్ ఉన్నత విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల గంభీరావుపేటలో అన్న అక్క మెంటార్ షిప్, ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) డిజిటల్ లెర్నింగ్ ఇంటర్నషిప్ ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కొనసాగుతున్నటువంటి శిక్షణలో ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికి మాత్రమే పరిమితం కాకుండా సాంకేతిక నైపుణ్యాలు కమ్యూనికేషన్ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు మరియు బోధన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ ఇంటర్షిప్ ద్వారా విద్యార్థులకు సమీప ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ఏఐ, డిజిటల్ లెర్నింగ్ అంశాలను దించే అవకాశం లభిస్తుందని, ఇది వారి భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ కోడ్ మిత్ర లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు అందరూ కూడా అసైన్మెంట్ అన్ని కంప్లీట్ చేసుకుని సర్టిఫికెట్ పొందాలని కోరారు. ఈ కార్యక్రమ నోడల్ ఆఫీసర్లు డాక్టర్ జె శ్రవణ్ కుమార్, డాక్టర్ ఎన్ అదివిష్ణు, కె.మహేష్ లు విద్యార్థుల చేత శిక్షణను పూర్తి చేయించి వారికి సర్టిఫికెట్లు అందే విధంగా చేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అగ్రహారం అధ్యాపకుడు రాజ్ కుమార్ విద్యార్థులకు ఆక్టివిటీస్ లో వచ్చేటువంటి కోడింగ్ డీకోడింగ్, ఫ్లో చార్ట్, అలాగరీతం లలో వచ్చే సమస్యలను వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రభాకర్, డాక్టర్ వై ఆంజనేయులు పాక ధర్మపురి వి వాణి, డాక్టర్ కె వి బిక్షమయ్య, మనోహర్ శ్రీనివాస్, సుచరణ్, కృష్ణ ప్రసాద్, శంకర్ దీపిక భార్గవి పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *