జనం న్యూస్ మధిర జూన్ 28, దోర్నాల కృష్ణ పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మధిర ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పిల్లల వైద్యుల నిపుణులు డాక్టర్ దగ్గుబాటి శ్రీను అన్నారు. ఆదివారం మధిర సాక్షి పత్రిక ఆర్సి ఇంచార్జి సీనియర్ పాత్రికేయులు అట్లూరి సాంబిరెడ్డి లీలావతి దంపతుల మనవడు, ఎన్నారై అట్లూరి సాయి ప్రకాష్ రెడ్డి నిఖిత రెడ్డి కుమారుడు అద్వైత్ కి పల్స్ పోలియో* చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరూ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని ఆయన కోరారు.