ఎండకు.. వానకు.. కూలీలంతా రోడ్లపైనే నిరీక్షణఅందుబాటులో లేని షెడ్లు, తాగునీటి సౌకర్యాలుఅడ్డా కూలీలపై నిర్లక్ష్యం..

ప్రభుత్వం చిన్న చూపుకనీస వసతులు కల్పించాలని కూలీల వినతి

జనం న్యూస్ 26. జూన్. టేక్మాల్ ( ప్రతినిధి ) మెదక్ పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరి కుటుంబ పోషణ కోసం అడ్డాకు చేరుకునే రోజువారీ కూలీల బతుకులు దయనీయంగా మారాయి. పని దొరుకుతుందో లేదో తెలియని అనిశ్చితిలో గంటల తరబడి ఎండలో నిలబడాల్సి వస్తోంది. వర్షం కురిసినా, ఎండ మండిపోతున్నా తలదాచుకునేందుకు కనీసం షెడ్ కూడా లేకపోవడం అధికారుల, పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. మెదక్ పట్టణంలోని ప్రధాన అడ్డాల వద్ద ప్రతిరోజు వందలాది మంది మహిళలు, పురుషులు పని కోసం వేచి ఉంటున్నారు. అయితే వీరి కోసం తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కేంద్రాలు, నీడనిచ్చే షెడ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. మహిళా కూలీలు చిన్నారులతో అడ్డాలకు రావాల్సి రావడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు పెరుగుతున్న ధరలు, విస్తరిచిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డా కూలీలకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చి, పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద శాశ్వత షెడ్లు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డా కూలీలకు వారు వేచి ఉండే జిల్లాలోని ప్రధాన కూడళ్ల వద్ద కనీస వసతులు కల్పిస్తారో లేదో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *