విజయవంతంగా ముగిసిన మొదటి బ్యాచ్ యోగా శిక్షణ తరగతులు

జనం న్యూస్ జూలై 2 మధిర టౌన్ ప్రతినిధి నండ్రు సుందర్ రావు జులై 7 నుండి 2 వ బ్యాచ్ ప్రారంభం మధిర రిక్రియేషన్ క్లబ్ లో గత 10 రోజుల నుంచి శివానంద గురూజీ శిక్షణ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న మధిర ప్రజలు
మధిర మున్సిపాలిటీ పరిధిలోగల రిక్రియేషన్ క్లబ్ నందు గత 10 రోజుల నుంచి యోగా శిక్షణ తరగతులు అగస్త్య పీఠం సుగుణానంద మహర్షి ఆశీస్సులతో గురూజీ శివానంద ద్వారా యోగ క్లాసులు విజయవంతంగా పూర్తి చేసినారు. యోగ అనేది
శారీరక, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో అవసరమని, ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తుందని గురూజీ శివానంద తెలిపారు. జుజ్జూరు దగ్గర నరసింహ పాలెం గ్రామంలో అగస్త్య పీఠము ట్రస్ట్ వారి అధ్వర్యంలో శ్రీ సుగుణానం ద మహర్షి ఆశీస్సులతో పది రోజులు పాటు శిక్షణా తరగతులు రిక్రియేషన్ క్లబ్ మధిర నందు నిర్వహించి యోగ పై అవగాహన, మెలకువలు, ఆసనాలు, ప్రాణాయామాలు, తదితర యోగ పై సాధన నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా గురూజీ శివానంద మాట్లాడుతూ రోజువారి జీవితంలో పెరిగే ఒత్తిళ్లు, అనారోగ్య సమస్యలు, ఆందోళనలు అధిగమించడానికి యో గ అత్యంత ఔషధము అని తెలిపారు.యోగ గురువు శివానంద గురూజీ మాట్లాడుతూ ఆధునిక కాలంలో వచ్చే జీవనశైలి వ్యాధుల నియంత్రణకు యోగా ఎంతో మేలు చేస్తుందన్నారు. యోగా మన జీవితంలో ఎన్నో సంవ త్సరాల నుంచి భాగమై పోయిందని, క్రమం తప్పకుండాయోగాసనాలు వే యడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయన్నారు. యోగాని జీవితంలో భాగం చేసుకుంటే ఒత్తిడి, ఆందోళనల ను తగ్గుతాయని, మనకి వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకి యోగాలో పరిష్కా రాలు ఉన్నాయన్నారు. యోగా శిక్షణ తరగతుల సమయంలో అమృత హార ము అందించటం జరిగింది. జూలై ఏడు నుంచి రెండవ బ్యాచి తరగతులు రిక్రియేషన్ క్లబ్ లోనే ప్రారంభమవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమం లో యోగ సాధకులు, మధిర పట్టణ ప్రజలు, పలు విద్యాసంస్థల అధినేతలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, డాక్టర్స్, లాయర్లు వీరంతా గత పది రోజుల నుంచి యోగ సాధన చేసినారు. తదుపరి గురూజీ శివానందను యోగ సాధకులు బుధవారం నాడు ఘనంగా సన్మానించి, పూలమాలలతో మరియు దుశ్యాలువా తో ఘనంగా సన్మానించి గురువు ఆశీస్సులు యోగ సభ్యులు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *