జనం న్యూస్ , జూలై 2: కోటబొమ్మాళి మండలం : అనకాపల్లి జిల్లా వి. మాడుగుల మండలం వమ్మిలి గ్రామం చెరుకు కాటా జంక్షన్‌లో వెలసిన శ్రీ కాళికా అమ్మవారు, శ్రీ దుర్గమ్మవారు, శ్రీ గంగాలమ్మవారి త్రిశక్తి పీఠం ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం గురువారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు.ఆలయ ధర్మకర్తలు సేనాపతి వెంకట అప్పారావు–శ్రీమతి రేవతి దంపతులు, యానాపు శ్రీను గురు భవాని, గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు పలువురు గురు భవానులు కార్యక్రమానికి హాజరై అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కల్లి విశ్వనాథ రెడ్డి గురు భవాని, జరజాన రాము గురు భవాని, రొక్కం రమేష్ గురు భవాని, పారుపూడి రాజు గురు భవాని, అమ్మోరు గురు భవాని, రాజు గురు భవానిలను ఆలయ నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించి వారి ఆధ్యాత్మిక సేవలను కొనియాడారు.ఈ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.