జనం న్యూస్ జూన్ 26, రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు మండలంలో గల కన్నంపేట గ్రామం లో వెంచేసియున్న గ్రామదేవత కనికలమ్మ అమ్మవారి పండుగను గ్రామస్తులు సహకారంతో ఘనంగా నిర్వహించారు.ఉదయం నుండి అమ్మ వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది పలువురు భక్తులు తలనిలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.మద్యహ్నం బారీ అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు.రాత్రికి గ్రామం లో సాంఘిక నాటకం ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కన్నంపేట కోలనీ గ్రామం లో ఉన్న యువకులు వ్యాపారం నిమిత్తం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో నివసిస్తున్నారు వారంతా బుధవారం సాయంత్రం నికే గ్రామానికి చేరుకుని అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు.ప్రతి ఏడాది కనికలమ్మ వారి పండుగ ను బారీ మందుగుండు సామగ్రి తో పాటు మేళ తాళాలు తోవైభవంగా నిర్వహించారు.