ప్రభుత్వ నిధులలో చేతివాటం చూపుతున్న-మున్సిపాలిటీ ఆనందపై చర్యలు తీసుకోవాలి…

జనం న్యూస్ నందవరం:-గురువారం 1-7-2026, నందవరం లో అక్రమాలకు పాల్పడుతూ చేతివాటం చూపుతున్న మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఆనంద పై వెంటనే చర్యలు తీసుకోవాలి మునిసిపాలిటీ లో పని చేసినటువంటి జీతాలపై విడుదల  చేసిన నిధులలో చేతివాటం చూపుతున్న  ఆనంద పై చర్యలు తీసుకోవాలని తోటి వర్కర్లు తెలిపారు. ఈ నిధులు విడుదలైనప్పటికీ ఈ నిధులను పూర్తిగా తోటి పని చేసినటువంటి వర్కర్లకు అందించకుండా మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఐదు మందిని బెదిరించి మీరు ప్రతిరోజు పని చేయకున్న చేసినట్టు చెప్పి ఆరు నెలలకు ఒక్కసారి  రూ.10,000/- నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.పడే జీతాలను ప్రతి నెల నెల నేను మీ జీతాలు  సార్ వాళ్ళతో మాట్లాడి దగ్గరుండి పెట్టిస్తున్నాను ఆయనతో పాటు పనిచేసినటువంటి మీరు పని చేస్తే చేయండి లేదంటే ఇకనుంచి వెళ్లిపోండి అంటూ వారిపై అసభ్యకరంగా మాట్లాడడం వారిని భయపెట్టడం ఈ నిధులను వారికి పూర్తిగా అందించకుండా కేవలం రూ.8,000/- మాత్రమే ఇచ్చినట్లు ఆరోపించారు. ఈ విషయం బయటకు వెల్లడిస్తే పని నుండి తొలగిస్తామంటూ హెచ్చరిస్తూ భయభ్రాంతులకు గురిచేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ విధంగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ కళంకం తెచ్చిన ఆనంద పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా విడుదల చేసిన పూర్తి మొత్తాన్ని పనిచేసేవారి చేతికి అందించేలా చర్యలు తీసుకోవాలని, ఆయనపై శాఖపరమైన కఠినమైన చర్యలు తీసుకుని, ఆయనను విధులనుండి తొలగించాలని కోరారు.       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *