జనం న్యూస్/జూన్ 27/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : సోమరాజు నడపాల పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం ప్రధాన కేంద్రంలో ఉన్న వై.టి.సి యూత్ ట్రైనింగ్ సెంటర్ నందు 1/70 చట్టం పరిరక్షణ కోసం అఖిలపక్ష సమాసం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.1/70 చట్టం పరిరక్షణ కోసం ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఆదివాసి ప్రజలందరూ ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని,లీగల్ గా న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని,ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని,పెసా గ్రామ సభలను బలోపేతం చేయాలని మరియు భారత రాజ్యాంగం లోని 5వ,6వ షెడ్యూల్ గురించి,ఏజెన్సీ లా గురించి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఆదివాసి ప్రతినిధులు ప్రధానంగా చర్చించారన్నారని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తెలిపారు. పోలవరం జిల్లా అడక్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గౌరవ అధ్యక్షులుగా కంగాల శ్రీనివాసు,చైర్మన్ గా లోతా రామారావు,వైస్ చైర్మన్ గా వెదుళ్ళ లచ్చిరెడ్డి,కారం సురేష్ బాబు,శ్రీరామ్ స్వప్న కుమారి,ప్రధాన కార్యదర్శి గా సమర్త కృష్ణ,సహాయ కార్యదర్శులుగా గొర్లె నారాయణరావు,చెదల వెంకటరెడ్డి మద్దేటి అంజిరెడ్డి,పల్లాల లింగారెడ్డి,వంతు బాలకృష్ణ,గంపా నాగరాజు, కోశాధికారిగా మట్ల కృష్ణారెడ్డి,సన్యాసి రెడ్డి,లీగల్ టీమ్ గా విండేల సామయ్య, కోవ్వాసు శ్రీనివాసు,మడివి ఠాగూర్,మడివి నెహ్రూ మొదలైన వారిని ఎన్నుకోవడం జరిగిందన్నారు.కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ ఐక్యమత్యంతోనే భూమి చట్టాలు కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డి,మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి,ఎంపీపీ బంధం శ్రీదేవి జెడ్పిటిసి,పండా వెంకట లక్ష్మీ,ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర,ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి చవ లం శుభ కృష్ణ,సంయుక్త కార్యదర్శి మడకం వరప్రసాద్ దొర,జాతీయ సమన్వయకర్త పొడియం పండు దొర,పండ పవన్ కుమార్ దొర,యలగాడ నాగేశ్వరరావు,కుంజం సత్యనారాయణమ్మ,,కారం సురేష్ బాబు,ఈక బుల్లి కొండల దొర,పండా వరలక్ష్మి,పందుల కామరాజు,సోడే మురళి మొదలైన వారు పాల్గొన్నారు.