జనం న్యూస్/జూన్ 27/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : సోమరాజు నడపాల ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు ఇప్పుడిప్పుడే విద్య పట్ల మక్కువ చూపుతున్నారు. చదువు యొక్క విలువలను తెలుసుకుంటున్నారు.ఈ తరుణంలో ఆదివాసి విద్యార్థులకు అందుబాటులో ఉన్న పాఠశాలలు రేష్నలైజేషన్ పేరుతో ఒక్కొక్కటిగా మూసి వేయడం అనేది చాలా బాధాకరం. ఏజెన్సీ ప్రాంతంలో ఎత్తివేయడానికి స్థానిక ప్రజల అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వాలు సొంత నిర్ణయం తీసుకోవడం అనేది ఏజెన్సీ ప్రజానీకానికే విరుద్ధం. ఏజెన్సీ ప్రాంతంలో పాఠశాలలు నిర్మించాలన్న పాఠశాలలు నిలుపుదల చేయాలన్న స్థానిక ప్రజల అనుమతులు లేకుండా చేయకూడదని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.అంతేకాకుండా కొండల మీద ఉన్న పి.వి.టి.జి లకు అందుబాటులో ఉన్న పాఠశాలలో ఎత్తివేయడం అనేది.వి.టి.జి ల అభివృద్ధికి ప్రమాదం పొంచి ఉంది. అటువంటి క్రమంలో అభివృద్ధి కావాలంటే కాలేరు.ఈ పాఠశాలల రేష్నలైజేషన్ పేరుతో ఒక్కొక్కటిగా ఎత్తివేసి ఆదివాసీలను పాతాళంలోకి ప్రభుత్వాలు నెట్టి వేస్తున్నాయనే కుట్ర జరుగుతున్నట్లు ఏజెన్సీ ప్రాంత ప్రజలు అంటున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో పాఠశాలలు అంతకు ముందున్న టిడిపి ప్రభుత్వం మూసివేయడం ద్వారా కొండల మీద నివసిస్తున్న విద్యార్థులు ఇళ్ళకే పరిమితమయ్యారు.ఇదంతా గమనించి వై.సి.పి ప్రభుత్వం మూసివేసిన పాఠశాలలను తిరిగి తెరిపించి కొండల మీద ఉన్న వారికి అందుబాటులో విద్యను తీసుకు రావడం జరిగింది.వై.సి.పి ప్రభుత్వం తెరిపించిన బడులను ఇప్పుడు అడువులలో నివసిస్తున్న విద్యార్థులు విద్యకు దూరం చేసే విధంగా రేష్నలైజేషన్ పేరుతో మళ్ళీ మూసివేస్తున్నారు.అంటే ఆదివాసీలకు అందుబాటులో విద్యానేర్పాటు చేస్తే తెలివివాంతు లైపోతారని, దోచుకోవడానికి కుదరదని అందుబాటులో ఉంచకుండా దూరం చేస్తున్నారని అర్ధమవుతుంది. ఈ విధంగా ఆదివాసీల అభివృద్ధిపై కుట్ర జరుగుతున్నది వాస్తవమేనని విశ్లేషకులు చెప్తున్నారు.ప్రభుత్వాలు ఆదివాసీ చట్టాలను చట్టాలు అమలు చేయడంలో కుట్ర,జి.ఓ లు అమలు చేయడంలో కుట్ర, హక్కులు అమలు చేయడంలో కుట్ర,నీటిని దోచుకోవడంలో కుట్ర, ఏజెన్సీ భూములు దోపిడీకి గురికావడంలో కుట్ర, ఏజెన్సీ సంపదను దోచుకోవడంలో కుట్ర,ఏజెన్సీ ప్రాంత భూభాగాన్ని ప్రాజెక్టుల పేరుతో,క్యారిడర్ల పేరుతో,జాతీయ పార్కులు, మైనింగ్ లాంటివి దోచుకోవడంలో బయటకు పంపే కుట్ర జరుగుతుందని విశ్లేషకులు తెలుపుతున్నారు. కొండల మీద ఉండే ఆదివాసీలు ఇప్పటికింకా విద్యకు దూరంగా ఉన్న విషయం ప్రభుత్వాలకి తెలిసినదే. ప్రభుత్వ పథకాలు పొందడంలో కూడా కొండల మీద ఉన్న ఆదివాసీలు పొందలేకపోతున్నారని అందరికీ తెలిసిన విషయమే.ఆ అటవీ ప్రాంతంలో ఉన్న సంపదను దోచుకోవడానికి కొండల మీద ఉన్న పి.వి.టి.జి ప్రజలను బయటకు పంపించి అక్కడున్న సంపదను దోచుకోవడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తప్ప,వారి అభివృద్ధి మాత్రం పట్టించుకోవడం లేదన్న విషయం విధితమే. ప్రభుత్వాలపై ఆదివాసీలు నిరంతరం పోరాటాలు ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వానికి తెలిసిన విషయమే. ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వాలకు మాత్రం తివాడి చెవిలో శంఖం ఊదిన మాదిరిగానే వ్యవహారిస్తున్నాయని ఆదివాసీ ప్రజలు అంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆదివాసుల బ్రతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆదివాసీ ప్రాంతంలో ప్రభుత్వాలు అభివృద్ధి చేసింది శూన్యమామంటున్న ఆదివాసీలు.ఆదివాసీ విద్యార్థులు గతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పాఠశాలలు ఇళ్లకే పరిమితమై కొంతమంది మూతి పనులకు జీవనం గడపసాగారు. అదే క్రమంలో కొంతమంది విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటుపడి చెడిపోయారు. మరి కొంతమంది సుదూర ప్రాంతాలకు వెళ్లలేక చదువులు ఆపుజేసుకున్నారు.ఆ విద్యార్థు లు పూర్తిగా డ్రాప్ అవుట్స్ గా మిగిలిపోయారు.ఆనాటి బడుల మూసివేత వల్ల అంత నష్టం జరిగింది.అందుకే ఇప్పుడు రేష్నలైజేషన్ పేరుతో ఏజెన్సీ ప్రాంతంలో పాఠశాలలు మూసివేయవద్దని, ఆ పాఠశాలలను యధావిధిగానే నడిపించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటూ దశల వారీగా నిరసనలు కొనసాగిస్తున్నారు.ఈ విషయంపై ఆదివాసీల సంక్షేమం కోరుకునేదేవరో ? పాతాళంలోకి పంపించేదెవరో అర్ధం చేసుకోవాల్సిన ఉంటుందని ఈ సందర్బంగా అర్ధమవుద్దందని విశ్లేషకులు వేచించుస్తున్నారు.