ఇల్లూరులో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐ ఆర్ ప్రక్రియ..

జనం న్యూస్ మధిర జూలై 1 దోర్నాల కృష్ణ మధిర మండలం: ఇల్లూరు గ్రామంలోప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, అర్హులైన ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పత్తెపరుపు.సంగయ్య సూచించారు.
ఈ సందర్భంగా ఇల్లూరు గ్రామంలో బి ఎల్ ఎ లతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించారు.ముఖ్యంగా ఓటర్ల పేర్లు తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ,అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామంలోని స్వాతంత్ర్య సమరయోధురాలు మువ్వా సీతారావమ్మ వారి నివాసంలో కలిసి, ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కు సంబంధించిన ఫారాన్ని అందజేసి, ఓటు హక్కు పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ , మువ్వా పద్మా బీఎల్‌ఎ మెట్టెల.ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *