చేనేత కార్మికులకు 2 వందల విద్యుత్ యూనిట్లు ఉచితం హర్షనీయం.

జనం న్యూస్ జూన్ 29 కోటబొమ్మాళి మండలం :కోటబొమ్మాళి మండలం తిలారు గ్రామంలో సోమవారం 50 చేనేత కార్మికుల కుటుంబాలకు200 యూనిట్లు ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంకు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు , కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటబొమ్మాళి మాజీ ఎం.పీ.పీ తర్ర రామకృష్ణ మాట్లాడుతూ తిలారు గ్రామానికి చెందిన చేనేత కార్మికులు కోసం ఎన్నో కార్యక్రమాలు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేపట్టారన్నారు. ఆనాడు చేనేత క్లస్టర్ ఏర్పాటు చేసిన సంగతి ఒక సారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజినీర్, కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *